|  
● FLASH NEWS
Konaseema: తెల్లవారుజామున పెద్ద శబ్దం.. గ్రామస్తులు ఎందుకు ఇళ్లు ఖాళీ చేశారో తెలుసా?  •  Akvan: నవంబర్ 20న ఆంధ్ర తీరం దాటనున్న అక్వాన్ తుపాను.. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్  •  Quad: మనీలాలో క్వాడ్ సమావేశం.. మోదీని ‘చాలా గట్టివాడు’ అని ప్రశంసించిన ట్రంప్  •  Dhoni: ఐపీఎల్ ఆటకు ధోని వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మార్గదర్శకుడిగా మహి  •  Charlapalli Fire: కరెంట్ కనెక్షనే లేని బోగీలో మంటలు ఎలా?.. చర్లపల్లి స్టేషన్‌లో భయానక అగ్నిప్రమాదం  • 
Skip to content

Sanjeevaraopet: సంజీవరావుపేట్‌లో ఘనంగా ఆలయ పునర్నిర్మాణం.. పాల్గొన్న హరీష్ రావు

సంగారెడ్డి, సూర్య న్యూస్ : నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట్ (Sanjeevaraopet) గ్రామంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మి అనంతశయన స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం, గజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao), నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న నాయకులకు గ్రామస్తులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరీష్ రావు, భూపాల్ రెడ్డి.. శ్రీలక్ష్మి అనంతశయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఇంతటి పవిత్రమైన ఆలయ పునర్నిర్మాణం, గజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ మహోత్సవంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బిక్షపతి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp