|   
🔴 BREAKING NEWS ► Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Skip to content

బీఆర్ఎస్ హయాంలోనే పండుగలకు అసలైన గౌరవం : ఇఫ్తార్ విందులో కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల పండుగలకు సముచిత ప్రాధాన్యత కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పండుగలు తమ ఉనికిని కోల్పోతున్నాయని, కనీసం బడ్జెట్ కేటాయింపులు కూడా లేకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు. శనివారం సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రజా రంజక పాలన బీఆర్ఎస్‌దే

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

​ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. గత ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్ వంటి పథకాలతో ప్రజలందరినీ ఆదరించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలను విస్మరిస్తూ ప్రజలను గోస పెడుతోందని మండిపడ్డారు. రంజాన్ మాసం అనేది ఆత్మపరిశుద్ధికి, సోదరభావానికి ప్రతీక అని, సమాజంలో ప్రేమ, ఐక్యత పెరగాలన్నదే ఈ పవిత్ర మాసం సందేశమని ఆయన పేర్కొన్నారు.

శాంతి సౌభాగ్యాలు నెలకొనాలి​

అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని ఆకాంక్షించిన కేటీఆర్.. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, BRS నాయకులు శంబీపూర్ రాజు, మైనారిటీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp