హైదరాబాద్, సూర్య న్యూస్: టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. తన డ్యాన్స్ స్టెప్పులతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ నటి, ఇటీవల ఒక ఈవెంట్లో తన పర్సనల్ లైఫ్ మరియు వృత్తిపరమైన అంకితభావం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన సినిమాల్లోని హిట్ సాంగ్స్ (Hit Songs) చాలా వరకు తాను పీరియడ్స్ (Periods) సమయంలోనే చిత్రీకరించారని ఆమె వెల్లడించింది.
సాకులు చెప్పడం కరెక్ట్ కాదు:
పురుషులతో సమానంగా అవకాశాలు, హక్కులు కోరుకుంటున్నప్పుడు నెలసరి వంటి సమస్యలను సాకుగా చూపి వెనక్కి తగ్గడం సరైన పద్ధతి కాదని శ్రీలీల పేర్కొంది. శారీరక, మానసిక ఇబ్బందులను అధిగమించి మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలని ఆమె అభిప్రాయపడింది. సమానత్వం కోరుకున్నప్పుడు ఇలాంటి విషయాలను సాకుగా చూపించకూడదని గట్టిగా చెప్పింది.
నెట్టింట భిన్నాభిప్రాయాలు:
అయితే శ్రీలీల చేసిన ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావాన్ని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. నెలసరి సమయంలో అందరి మహిళల శారీరక స్థితి ఒకేలా ఉండదని, విపరీతమైన నొప్పిని అనుభవించే వారు పని చేయడం సాధ్యం కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్వతహాగా డాక్టర్ (Doctor) చదివిన శ్రీలీలకు ఈ విషయం తెలియదా అంటూ కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.