|  
FLASH NEWS
Box Office Trend : బాక్సాఫీస్ వద్ద భక్తి పారవశ్యం.. రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఇరుముడి, హనుమాన్ అంశ్  •  Indian Army : రూ.46 లక్షల అమెజాన్ ప్యాకేజీ వదిలేసి సైన్యంలోకి.. నువ్వు గ్రేట్ గురూ!  •  వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  • 
Skip to content

Dr. BR Ambedkar Open University : అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో సామాజిక సాధికారత వారోత్సవాలు.. ‘BRAOU 2.0’ ప్రారంభించనున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్, సూర్య న్యూస్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) 135వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (BRAOU) ఏప్రిల్ 14- 2026న సామాజిక సాధికారత వారోత్సవాలు (Social Empowerment Week) అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఉదయం 10:30 గంటలకు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

అనంతరం ఉదయం 11:30 గంటలకు అడ్మిన్ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఏఐ డీఈఏ ల్యాబ్స్ (AI DEA Labs) ప్రారంభోత్సవంతో పాటు కీలకమైన డిజిటల్ సాధికారత కార్యక్రమాలను (BRAOU 2.0) లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు సమత (Samatha) అభ్యాసకులైన ఆదివాసీలు మరియు ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఫెలోషిప్ (JRFF) అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తారు.

​ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ వేడుకలకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చక్రపాణి ఘంటా (VC Prof Chakrapani Ghanta) అధ్యక్షత వహిస్తారు. ముగింపు వేడుకలకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ముఖ్య అతిథిగా హాజరవుతారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా (Dr Yogita Rana IAS) కళాశాల విద్య కమిషనర్ ఏ శ్రీదేవసేన (A Sridevasena IAS) పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ ఇ నవీన్ నికోలస్ (Dr E Naveen Nicolas IAS) జ్యోతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దుడిపాల జ్యోతి రెడ్డి (Jyothi Reddy) అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి తదితరులు పాల్గొంటారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎన్ సి వేణుగోపాల్ (Registrar NC Venugopal) కో ఆర్డినేటర్లు డాక్టర్ బానోత్ ధర్మ మరియు డాక్టర్ ఏ రమాదేవి ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సామాజిక న్యాయం మరియు డిజిటల్ రంగంలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp