|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై

Majji Srinivasa rao YCP
Majji Srinivasa rao YCP

విజయనగరం, సూర్య న్యూస్ : మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, ప్రస్తుత విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) రాజీనామా చేశారు. ఆయన తన పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త (Coordinator) పదవులకు కూడా విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ అధినేతకు రాజీనామా లేఖ ఈ మేరకు చిన్న శ్రీను తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పంపినట్లు సమాచారం. విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆయనకు బలమైన పట్టు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన, వైదొలగిన తర్వాత భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరుతారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయం జిల్లా రాజకీయాల్లో కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp