|  
● FLASH NEWS
VijayDeverakonda: ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్  •  Nobel: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌పై సెటైర్లు  •  Bypolls: ముస్లిం మెజార్టీ స్థానాల్లో బీజేపీ హవా  •  KCR: సీఎం రేవంత్‌పై వ్యూహం మార్చిన కేసీఆర్.. టార్గెట్ కొడంగల్!  •  NFSC : ఫెలోషిప్‌ల జాప్యంపై యువ న్యాయవాది పోరాటం  • 
Skip to content

Nobel: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌పై సెటైర్లు

సూర్య న్యూస్ డెస్క్ : అంతర్జాతీయ న్యాయశాస్త్రాన్ని ప్రోత్సహిస్తూ దశాబ్దాలుగా మానవ హక్కుల కోసం విశేషంగా పోరాడుతున్న భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా న్యాయ నిపుణురాలు నవనీతమ్ నవీ పిళ్ళై (Navi Pillay) ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని (Nobel Peace Prize) గెలుచుకున్నారు.

ట్రంప్‌పై చమత్కారం

ఈ అత్యున్నత పురస్కారం దక్కించుకున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నవీ పిళ్ళై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎప్పటినుంచో పాకులాడుతున్నారని పరోక్షంగా సెటైర్లు వేస్తూ.. అవసరమైతే ఈ అవార్డును ఆయనతో పంచుకుంటానని చమత్కరించారు. కాగా, గతేడాది ఈ బహుమతిని గెలుచుకున్న వెనిజులాకు చెందిన మరియా మచాడో అప్పట్లో తన అవార్డును ట్రంప్‌కు అంకితమిచ్చిన విషయం తెలిసిందే.

తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు..

నవీ పిళ్ళై మూలాలు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంతో ముడిపడి ఉన్నాయి. 1890వ దశకంలో ఆమె తాత చెరకు తోటల్లో పనిచేయడానికి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు శాంతమ్మ, నారాయణస్వామి కాగా.. ఆమె తండ్రి డర్బన్ నగరంలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. అత్యంత సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన నవీ పిళ్ళై.. అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో అంచెలంచెలుగా ఎదిగి నేడు అత్యున్నత నోబెల్ బహుమతి దక్కించుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp