|  
● FLASH NEWS
Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  •  Elections: ఏపీ మున్సిపల్ సీట్ల సర్దుబాటు ఖరారు.. బీజేపీకి రెండు, మరి జనసేన పరిస్థితేంటి?  •  తెలంగాణను భయపెడుతున్న ఎల్ నినో.. సీఎం ముందస్తు హెచ్చరికల వెనుక వ్యూహమేంటి?  • 
Skip to content

Wedding: రూమర్ల నుంచి రియల్ జోడీగా.. అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి ఫిక్స్

హైదరాబాద్, సూర్య న్యూస్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్, యూత్ ఐకాన్ కావ్య మారన్ (Kavya Maran), కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. నవంబర్ 10 లేదా 11వ తేదీన గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న ఈ జంట, నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

‘జస్ట్ ఫ్రెండ్స్’ నుంచి జీవిత భాగస్వాములుగా..

ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు మైదానంలో కావ్య మారన్ హావభావాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్రాంచైజీ ఓనర్‌గా టీమ్ గెలిచినప్పుడు సంతోషపడ్డా, ఓడిపోయినప్పుడు బాధపడ్డా ఆమె ఎక్స్‌ప్రెషన్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కుర్రకారుకు డ్రీమ్ గర్ల్‌గా మారిన కావ్య.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌తో తరచూ మ్యాచ్‌లలో, ఈవెంట్లలో కలిసి కనిపించడంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గతంలో పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. ఆ వార్తలపై స్పందించిన అనిరుధ్.. “పెళ్లా? ఈ రూమర్స్ కాస్త ఆపండి, మేం మంచి స్నేహితులం మాత్రమే” అని గతంలో కొట్టిపారేశారు. ఆయన టీమ్ కూడా పెళ్లి వార్తలను ఖండించింది. కానీ అభిమానులు మాత్రం ఆ మాటలను నమ్మలేదు. తాజాగా వెడ్డింగ్ కార్డ్స్ పంపిణీతో అప్పటి రూమర్స్ అన్నీ నిజమేనని తేలిపోయింది.

సీఎం రేవంత్, కేటీఆర్‌లకు ప్రత్యేక ఆహ్వానం

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఓనర్లు కావడంతో తెలంగాణ రాష్ట్రంతో మారన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే కావ్య పేరెంట్స్ కళానిధి మారన్, కావేరి మారన్ స్వయంగా హైదరాబాద్ వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెళ్లి శుభలేఖను అందజేశారు. అలాగే, ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా ప్రత్యేకంగా కలిసి వివాహానికి ఆహ్వానించారు.

నవంబర్ 10 లేదా 11న కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సినీ, క్రీడా వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ జరగనుంది. ఒకప్పుడు రూమర్ లవర్స్‌గా పిలిపించుకున్న వీరు, ఇప్పుడు అధికారికంగా రియల్ జోడీగా మారుతుండటంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp