|  
● FLASH NEWS
Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  • 
Skip to content

Starlink: మస్క్ ఇంటర్నెట్‌ను భారత్ తిరస్కరించిందా? అసలు నిజమిదే

ఢిల్లీ, సూర్య న్యూస్ : భారత్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ‘స్టార్‌లింక్’ (Starlink)ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఇది కేవలం నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) అనే ఒక ప్రైవేట్ ఎన్‌జీవో వ్యక్తం చేసిన అభిప్రాయం మాత్రమేనని, భారత ప్రభుత్వ అధికారిక నిర్ణయం కాదని స్పష్టమైంది.

ఇటీవల ఎన్‌సీఐబీ తమ ‘ఎక్స్’ ఖాతాలో.. “భారత్‌కు విదేశీ హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరం లేదని, దేశ భద్రతే తమకు ముఖ్యమని” మస్క్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. సదరు సంస్థ పేరులో ‘బ్యూరో’ అని ఉండటంతో, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారిక దర్యాప్తు సంస్థ అని, ప్రభుత్వమే స్టార్‌లింక్‌ను తిరస్కరించిందని పలు వార్తలు వచ్చాయి. కానీ, వారి ఖాతా బయో ప్రకారం అది కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) మాత్రమే. ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించే ఎలాంటి అధికారిక హోదా ఆ సంస్థకు లేదు.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్టార్‌లింక్ ప్రతిపాదనలను తిరస్కరించలేదు. ప్రస్తుతం స్టార్‌లింక్, జియో శాటిలైట్, యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు టెలికాం లైసెన్సులు మాత్రమే లభించాయి. ఈ మూడు సంస్థల వాణిజ్య సేవలకు సంబంధించి కేంద్ర హోం శాఖ నుంచి తుది భద్రతా అనుమతులు (Security Clearance) మంజూరు కావాల్సి ఉంది.

శాటిలైట్ కమ్యూనికేషన్స్ అనుమతుల ప్రక్రియలో అన్ని సంస్థల పట్ల ఒకే విధానాన్ని అనుసరిస్తున్నామని, ఎవరి పట్లా వివక్ష చూపడం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు, భారత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా యూజర్ల డేటాను స్థానికంగానే ఉంచేలా తాము దేశీయంగా గేట్‌వేలను అభివృద్ధి చేసినట్లు స్టార్‌లింక్ వెల్లడించింది. కేంద్ర హోం శాఖ నుంచి తుది భద్రతా అనుమతులు రాగానే స్టార్‌లింక్ సేవలపై అధికారిక స్పష్టత రానుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp