|  
● FLASH NEWS
Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  • 
Skip to content

UCO Bank: యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి!

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : ప్రభుత్వ రంగ సంస్థ యూకో బ్యాంక్ (UCO Bank) 530 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 1, 2022 లేదా ఆ తర్వాత తమ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు అక్టోబర్ 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ. 16,650 స్టైపెండ్ చెల్లిస్తారు.

ఆన్‌లైన్ రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.800, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.600 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష నవంబర్ 7వ తేదీన నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://nats.education.gov.in/ లేదా యూకో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ uco.bank.in లో చూడవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp