|  
● FLASH NEWS
ParaGames: ఏషియన్ పారా గేమ్స్‌లో పతకాల పంట.. గోల్డ్ కొట్టిన తెలంగాణ అథ్లెట్ దీప్తి  •  MLC: పూరి గుడిసె నుంచి పట్టభద్రుల పోరు దాకా.. ఎమ్మెల్సీ బరిలో ఉద్యమకారుడు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్!  •  PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  • 
Skip to content

Indrakeeladri: ఆధ్యాత్మిక వైభవంగా ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

విజయవాడ, సూర్య న్యూస్ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల పాటు సాగిన ఈ దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించిన మెరుగైన సౌకర్యాలు, సేవల నాణ్యత పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో రికార్డు స్థాయిలో పది రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు కనకదుర్గ అమ్మవారి దర్శన భాగ్యం పొందడం చాలా సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే దాదాపు 8 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, ఇది అమ్మవారి సేవలో అధికారులు, సిబ్బంది చేసిన సమిష్టి కృషికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గిందని చంద్రబాబు గుర్తుచేశారు. దర్శన సమయం తగ్గడంతో పాటు భక్తులకు అందించే సేవల నాణ్యత కూడా మునుపటి కంటే పెరగడం అభినందనీయమని అధికారులను, ఆలయ పాలక మండలిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp