కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులు

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతూ సమగ్ర సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ (Quthbullapur MLA) పిలుపునిచ్చారు. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు గట్టు రామచంద్ర రావు, రాష్ట్ర అధ్యక్షులు గుండాల మల్లేష్ గౌడ్ మార్గదర్శకత్వంలో పలువురు నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

అందరినీ కలుపుకుని వెళ్లాలి
ఈ మర్యాదపూర్వక భేటీలో నాయకులకు ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ పలు కీలక సూచనలు చేశారు. నాయకులుగా ఎదిగే క్రమంలో కేవలం తమ సామాజిక వర్గానికే పరిమితం కాకుండా, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు
సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సురేష్ గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ జ్యోతి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. బహదూర్ పల్లి డివిజన్ జనరల్ సెక్రటరీ చెలిమిన స్వప్న గౌడ్, నిజాంపేట్ యూత్ అధ్యక్షులు ఉప్పాల సాయికుమార్ గౌడ్, బెల్లంకొండ యాకయ్య గౌడ్, నరసింహ గౌడ్, మహేష్ గౌడ్, మాధవి గౌడ్, నేరెళ్ల కుమార్, ఇరువురి రాఘవేంద్ర గౌడ్ తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



