
హైదరాబాద్, సూర్య న్యూస్ : రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauji Movie) సినిమా గ్లింప్స్ వీడియోపై తాజాగా వివాదం చెలరేగుతోంది. ఇటీవల విడుదలైన ఈ వీడియోలో ప్రభాస్ (Prabhas) క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేందుకు స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రిఫరెన్స్‌ను వాడుకోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ నాయకుడైన నేతాజీ త్యాగాలను అవమానించేలా, కేవలం ఒక కమర్షియల్ హీరో ఎలివేషన్ కోసం ఆయనను వాడుకోవడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు. చిత్ర యూనిట్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని, వివాదాస్పదంగా ఉన్న ఆ సన్నివేశాన్ని వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఈ వివాదంపై కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా అనేది ఒక కల్పిత కథ అని, అందులోని విషయాలను మరీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుపుతూ చిత్ర యూనిట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే, పెరుగుతున్న ఈ విమర్శలపై సినిమా నిర్మాతలు లేదా దర్శకుడు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



