|  
● FLASH NEWS
Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  • 
Skip to content

TWJF: కుత్బుల్లాపూర్ టీడబ్ల్యూజేఎఫ్ నాలుగో మహాసభ.. పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు

కుత్బుల్లాపూర్ టీడబ్ల్యూజేఎఫ్ నాలుగో మహాసభ

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాలుగో మహాసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు సూరారం డా. బి.ఆర్. అంబేద్కర్ భవన్‌లో జరగనుంది. ఈ మహాసభను జయప్రదం చేయాలని నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ బీఎస్, ప్రధాన కార్యదర్శి గోవింద్ రావు ఒక ప్రకటనలో కోరారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఈసీ కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు, స్థానిక కమిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ మహాసభను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది అశోక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నియోజకవర్గ పరిధిలోని కమిటీ సభ్యులు, జర్నలిస్టు మిత్రులు, సంబంధిత ప్రతినిధులంతా సకాలంలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp