|  
● FLASH NEWS
Environment: కాలుష్య రహిత దీపావళి.. పర్యావరణ పరిరక్షణపై స్థానికుల గళం!  •  Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  • 
Skip to content

Development: లెజెండరీ స్టేట్ కాలనీలో రూ.40 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభం

లెజెండరీ స్టేట్ కాలనీలో రూ.40 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభం

సూర్య న్యూస్ డెస్క్ : ఏళ్లుగా సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న ఓ కాలనీవాసులకు ఎట్టకేలకు ఊరట లభించింది. లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లు అందుబాటులోకి రావడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. రోడ్ల ప్రారంభోత్సవంతో పాటు కాలనీ సమస్యలపై ప్రజలతో నేరుగా చర్చించిన నేత, దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

లెజెండరీ స్టేట్ కాలనీలో రూ.40 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి పరిధిలోని లెజెండరీ స్టేట్ కాలనీలో రూ. 40 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను కాంగ్రెస్ (Congress) పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. సీఎంసీ నిధుల ద్వారా మంజూరైన ఈ రహదారులతో కాలనీవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అనంతరం కాలనీవాసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని, స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.

నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో ప్రజల అవసరాలను గుర్తించి, దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజల దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొలన్ జీవన్ రెడ్డి, నాయకులు వరగాని వాసు, కోటపాటి మురళి, సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, మైసిగరి శ్రీనివాస్, రఫియా బేగం, కడియాల ఇందిరా, ఆలేటి శ్రీనివాస్ తదితరులతో పాటు కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp