
రష్యాలో జన్మించి, సింగపూర్‌లో హోటల్ రంగంలో.. అన్నా లెజినోవా నేపథ్యం ఇదే
సూర్య న్యూస్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లోని ఒక అగ్ర రాజకీయ నాయకుడు తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఆమె నేపథ్యం, ఆస్తుల వివరాలపై విస్తృత చర్చ జరుగుతోంది.
అమరావతి, సూర్య న్యూస్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన మూడో భార్య అన్నా లెజినోవాతో (Anna Lezhneva) విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆమె నేపథ్యం, ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. రష్యాకు చెందిన అన్నా లెజినోవాకు సంబంధించి జాతీయ మీడియాలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 1980లో రష్యాలో జన్మించిన అన్నా లెజినోవాకు సింగపూర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. రష్యా, సింగపూర్లలో ఆమెకు కొన్ని హోటల్స్‌తో పాటు మొత్తం రూ.1,800 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె విద్యాభ్యాసం విషయానికొస్తే, 2024లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఆగ్నేయాసియా అధ్యయనాల్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌తో 2011లో ‘తీన్ మార్’ సినిమా సందర్భంగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2013 సెప్టెంబర్‌లో వీరు వివాహం చేసుకున్నారు. దాదాపు పుష్కర కాలం పాటు కలిసి ఉన్న వీరు, తాజా పరిణామాలతో తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నట్లు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



