
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో నవంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ‘ఛాయా సాహిత్యోత్సవం’ జరగనుంది. ఛాయా, రూట్స్ కొలీజియం (Roots Collegium) సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక సాహిత్య, చరిత్ర, సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు
గత రెండేళ్లుగా విశ్వవిద్యాలయంలో ఈ సాహిత్యోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న రూట్స్ కొలీజియం బృందాన్ని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఉత్సవానికి దేశవిదేశాల నుంచి ప్రముఖ రచయితలు, విద్యావేత్తలు, సాహిత్య ప్రముఖులు విచ్చేసి సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పలు కీలక అంశాలపై మేధోమథనం చేయనున్నారని ఆయన వెల్లడించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఇటువంటి పరస్పర చర్చల ద్వారా తెలంగాణ విశిష్ట సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ వేదిక గొప్పగా దోహదపడుతుందని వీసీ ఆకాంక్షించారు. సాహిత్యం మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే దిశగా నిర్వాహకులు తమ కృషిని మున్ముందు కూడా ఇలాగే కొనసాగించాలని సూచించారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



