
నల్గొండ, సూర్య న్యూస్ : తెలంగాణలో మళ్లీ కేసీఆర్ (KCR) పాలన రావాలని ఆకాంక్షిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు గుండాల మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర ప్రారంభమైంది. నార్కట్‌పల్లి మండలం నకరేకల్ నియోజకవర్గంలోని చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రారంభమైన ఈ యాత్ర కేసీఆర్ ఫామ్‌హౌస్ వరకు కొనసాగనుంది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతోందని, ప్రజలకు మేలు జరగాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని గుండాల మల్లేష్ గౌడ్ కోరారు. బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, పెన్షన్లు వంటి పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని గుర్తుచేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ స్థాయిలో న్యాయం జరగడం లేదని ఆయన విమర్శించారు.

ఈ పాదయాత్రలో నాగర్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వడిత్య నాగరాజు నాయక్, తుంగతుర్తి నుంచి మల్కాపురి శ్రీకాంత్ గౌడ్, మునుగోడు నుంచి బొడ్డు రవి, నల్గొండ జిల్లా టీహెచ్ఆర్ సేవా సమితి నాయకులు గోదాల హరీష్ రెడ్డి, నాగన్న, కార్తీక్ రెడ్డి, మహిళా నాయకురాలు గుండాల పావని పాల్గొన్నారు. కాగా, ఈ పాదయాత్రకు నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఉటుకూరు ఏడుకొండలు సంఘీభావం తెలిపారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



