
అమరావతి, సూర్య న్యూస్ : దసరా పండుగ (Dasara Festival) రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (JMD) శివప్రసాద్ తెలిపారు. పండుగ సమయంలో నడిపే ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
దసరా పండుగతో పాటే తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీని తట్టుకునేలా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్లలో భక్తుల కోసం 425 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లు జేఎండీ వివరించారు.
త్వరలో 3,000 కొత్త బస్సులు
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకం కారణంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని అధికారులు గుర్తించారు. ఈ పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా.. భవిష్యత్తులో సుమారు 3,000 కొత్త బస్సులను సమకూర్చుకోవాలని ప్రణాళికలు రూపొందించినట్లు శివప్రసాద్ వెల్లడించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



