|  
● FLASH NEWS
Cinema: పెళ్లైతే పిల్లలు కనాలా? సమాజంపై వరలక్ష్మి ఫైర్  •  VijayDeverakonda: ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్  •  Nobel: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌పై సెటైర్లు  •  Bypolls: ముస్లిం మెజార్టీ స్థానాల్లో బీజేపీ హవా  •  KCR: సీఎం రేవంత్‌పై వ్యూహం మార్చిన కేసీఆర్.. టార్గెట్ కొడంగల్!  • 
Skip to content

BankofBaroda: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,100 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా 1,100 వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును అక్టోబర్ 16 వరకు పొడిగిస్తూ (Last Date Extended) కీలక ప్రకటన చేసింది.

సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ వాస్తవానికి అక్టోబర్ 1తో ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును అక్టోబర్ 16వ తేదీ వరకు పొడిగించారు. మొత్తం 1,100 ఖాళీల్లో 1,000 వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, 100 క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

పోస్టును బట్టి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటికి అదనంగా సంబంధిత విభాగాల్లో పని అనుభవం తప్పనిసరి. వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి నిర్దిష్ట సర్టిఫికేషన్ కూడా ఉండాలని, అనుభవం మరియు సర్టిఫికేషన్ పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ పరిశీలించాలని సూచించారు. 2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు పోస్టును బట్టి వేర్వేరుగా ఉంటుంది. వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 22 నుంచి 32 ఏళ్లు, క్రెడిట్ అనలిస్ట్ పోస్టుకు 21 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజును రూ.175గా నిర్ణయించారు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.93,960 వరకు బేసిక్ పే స్కేల్ అందుతుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp