
హైదరాబాద్, సూర్య న్యూస్ : అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘సీడీకే గ్లోబల్’ (CDK Global) అధ్యక్షుడిగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO), బోర్డు సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ రామకృష్ణ నియమితులయ్యారు. టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి సంస్థ ఆగస్టు 27న అధికారిక ప్రకటన చేయగా, అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆయన నియామకం అధికారికంగా అమల్లోకి వచ్చింది.
ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివిన సుధాకర్ రామకృష్ణకు ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, క్లౌడ్ నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. సీడీకే గ్లోబల్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన ప్రముఖ సంస్థ సోలార్‌విండ్స్ సీఈఓగా విశేష సేవలు అందించారు.
మరోవైపు, ఇప్పటివరకు సీడీకే సంస్థను నడిపించిన సీఈఓ బ్రియాన్ మాక్‌డొనాల్డ్ పదవీ విరమణ పొందారు. అయితే ఆయన సంస్థ నుంచి పూర్తిగా వైదొలగకుండా.. బ్రూక్‌ఫీల్డ్ మరియు సీడీకే సంస్థలకు సీనియర్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా కొనసాగుతారని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. సుధాకర్ రామకృష్ణ నియామకంతో మరో తెలుగు వ్యక్తి అమెరికా కార్పొరేట్ రంగంలో అత్యున్నత నాయకత్వ స్థానానికి ఎంపిక కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



