|  
FLASH NEWS
Indian Army : రూ.46 లక్షల అమెజాన్ ప్యాకేజీ వదిలేసి సైన్యంలోకి.. నువ్వు గ్రేట్ గురూ!  •  వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  •  ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  • 
Skip to content

నకిలీ అనుమతులకు హైడ్రా బ్రేక్ : నెక్నాంపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా: రూ.54 కోట్ల విలువైన భూమి స్వాధీనంరంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ పరిధిలోని నార్సింగి గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ ఎన్‌క్లేవ్ సెక్రటేరియట్ కాలనీలో హైడ్రా అధికారులు బుధవారం భారీ ఆక్రమణలను తొలగించారు సర్వే నంబర్ 31లో పార్కు మరియు ప్రజా అవసరాల కోసం కేటాయించిన 2700 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ప్లాట్లుగా మార్చి నిర్మాణాలు చేపట్టారు ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.54 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు పక్కనే ఉన్న సర్వే నంబర్ 22లోని ప్లాట్ అనుమతులను చూపిస్తూ ఈ ప్రజా స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు విచారణలో తేలింది

సెక్రటేరియట్ కాలనీలో మెరుపు దాడి

సెక్రటేరియట్ ఉద్యోగుల కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి విచారణ జరిగింది విచారణలో ఆక్రమణలు ధృవీకరించబడటంతో హైడ్రా బృందం వెంటనే రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేసింది మొత్తం 2700 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే త్రెస్‌పాసర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్రజా అవసరాల కోసమే ఈ స్థలం

2007లో హుడా ఆమోదించిన లేఅవుట్ ప్రకారం ఈ స్థలం కేవలం పార్కు మరియు సామాజిక అవసరాల కోసమేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి ఇలాంటి విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టడంపై అధికారులు సీరియస్ అయ్యారు హైడ్రా తీసుకున్న ఈ చర్యతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూములను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ ఆపరేషన్ ద్వారా హైడ్రా మరోసారి స్పష్టం చేసింది స్వాధీనం చేసుకున్న భూమిని పూర్తిస్థాయిలో రక్షించేందుకు స్థానిక సంఘాలతో కలిసి మరిన్ని చర్యలు చేపట్టనున్నారు

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp