|  
FLASH NEWS
ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీకి కేసీఆర్.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్  •  శ్రీలంక ఔట్, భారత్ ఇన్.. తొలి ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి తేదీలు, జట్లు ఖరారు  •  ‘ఇరుముడి’ సీక్వెల్‌పై దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ.. రామ్ చరణ్ రూమర్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు  •  పవన్ బర్త్‌డే స్పెషల్: ‘ఓజీ యూనివర్స్’ పై బిగ్ అప్‌డేట్.. ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్‌డ్రాప్‌తో వీడియో విడుదల  •  నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌పై తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ సంచలన డిమాండ్  • 
Skip to content

శ్రీలంక ఔట్, భారత్ ఇన్.. తొలి ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి తేదీలు, జట్లు ఖరారు

Indian women cricket team
Indian women cricket team

హైదరాబాద్, సూర్య న్యూస్ : క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శుభవార్త తెలిపింది. మొట్టమొదటి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Women’s Champions Trophy)కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుందని స్పష్టం చేసింది.

ఆరు జట్లతో టీ20 ఫార్మాట్‌లో..

ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ట్రోఫీ కోసం తలపడతాయి. ఈ మెగా టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. రౌండ్-రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో, అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌లో తలపడతాయి. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వడోదరలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి.

శ్రీలంక నుంచి భారత్‌కు ఆతిథ్య హక్కులు

వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంతో ఐసీసీ ఆతిథ్య హక్కుల నుంచి శ్రీలంకను తప్పించింది. ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికా అభ్యర్థనలను పరిశీలించిన ఐసీసీ.. చివరకు భారత్‌ను సిఫార్సు చేసింది. సెప్టెంబర్ 1న జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయానికి అధికారిక ఆమోదం లభించింది. 2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ.. మహిళల క్రికెట్‌లో ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp