
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : భారత్, న్యూజిలాండ్ (India-New Zealand) దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం కానుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) రేపటి నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ కీలక ఒప్పందంతో భారత్ నుంచి పలు కీలక రంగాల ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వాణిజ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ నూతన డీల్ ద్వారా ఫార్మా, జ్యువెలరీ, మెషినరీ, మాన్యుఫ్యాక్చర్డ్ గూడ్స్, ప్లాస్టిక్, టెక్స్‌టైల్ తదితర ఉత్పత్తుల ఎగుమతులు భారీగా ఊపందుకోనున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశానికి ఏకంగా 6 బిలియన్ డాలర్ల విలువ చేసే భారీ మార్కెట్ ఓపెన్ అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
గతంలో న్యూజిలాండ్ దేశం విధించే భారీ టారిఫ్‌లు, అత్యంత కఠినమైన రూల్స్ కారణంగా ఆ దేశానికి భారతీయ ఎగుమతులు చాలా పరిమితంగానే సాగేవి. తాజా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలుతో ఆ వాణిజ్య అడ్డంకులన్నీ తొలగిపోయి భారతీయ వ్యాపారులకు, ఎగుమతిదారులకు భారీ ప్రయోజనం చేకూరనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



