
కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : కార్మికుల హక్కుల విషయంలో ఏ సంస్థ అయినా నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి (BRTU Leader Ravi) స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని (Industrial Area) ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడికి రావాల్సిన బకాయి వేతనాలను ఆయన చొరవతో యాజమాన్యం చెల్లించింది.
గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని సదరు కంపెనీలో అప్సర్ హుస్సేన్ గత కొన్నేళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు ఒక నెల వేతనం రూ. 18,000, గ్రాట్యుటీ బకాయిలతో కలిపి మొత్తం రూ. 54,000 యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. బకాయిల కోసం కార్మికుడు పలుమార్లు కోరినప్పటికీ కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడంతో ఆయన విధులకు దూరమయ్యారు.
తనకు జరిగిన అన్యాయంపై అప్సర్ హుస్సేన్ తోటి కార్మికుల సూచన మేరకు బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిని కలిసి తన ఆవేదనను వివరించారు. వెంటనే స్పందించిన రవి సంబంధిత కంపెనీ వద్దకు చేరుకుని యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు.
కార్మిక చట్టాల ప్రకారం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన పట్టుబట్టడంతో యాజమాన్యం దిగివచ్చింది. ఒక నెల వేతనం, గ్రాట్యుటీ కలిపి మొత్తం రూ. 54,000 విలువైన చెక్కును కార్మికుడు అప్సర్ హుస్సేన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కార్మికుడు మాట్లాడుతూ, కష్టకాలంలో అండగా నిలిచి తనకు రావాల్సిన హక్కును ఇప్పించిన కార్మిక నాయకుడు రవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, జగన్, సుదర్శన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



