|  
● FLASH NEWS
Summit: అమెరికా, చైనా, రష్యా కీలక భేటీ.. నాలుగు ప్రధాన నిర్ణయాలు  •  Harish: సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా?.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్  •  Jobs: హైదరాబాద్‌లో 83 దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  •  TGBIE: ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే  •  Workers: కార్మికులకు అన్యాయం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదు: బీఆర్‌టీయూ నేత రవి  •  UGCNET: యూజీసీ నెట్ డిసెంబర్-2026 పరీక్షా షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ సబ్జెక్టులంటే?  • 
Skip to content

TGBIE: ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల (IPE) టైమ్ టేబుల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి 2027లో నిర్వహించనున్న ప్రాక్టికల్, థియరీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలను ముందుగానే తెలుసుకుని సన్నద్ధమయ్యేందుకు వీలుగా ఈ వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రాక్టికల్, ఇతర పరీక్షల షెడ్యూల్

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్ పరీక్షలు 2027 ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. ఆదివారాలతో సహా ప్రతిరోజూ రెండు సెషన్లలో అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆదివారాలతో కలిపి మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఈ సెషన్లు ఉంటాయి.

ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌ను ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 29న, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జనవరి 30న నిర్వహిస్తారు. నైతిక విలువలు, మానవ విలువలు పరీక్ష జనవరి 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పర్యావరణ విద్య పరీక్ష జనవరి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. అలాగే ఫస్ట్ ఇయర్ అంతర్గత మూల్యాంకనం జనవరి 20 నుంచి జనవరి 25 వరకు పూర్తి చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షల తేదీలు

ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలన్నీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1తో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-1, మార్చి 2న మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, మార్కెటింగ్ పేపర్-1 (ఏసీఈ) పరీక్షలు ఉంటాయి. మార్చి 5న మ్యాథమెటిక్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, కామర్స్ పేపర్-1 (ఏసీఈ), మార్చి 9న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1 నిర్వహిస్తారు.

మార్చి 15న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-1, మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, ఎంఈసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పేపర్-1, మార్చి 19న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1, బైపీసీ కొత్త మరియు పాత కోర్సుల విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 పరీక్షలతో ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగుస్తాయి.

సెకండ్ ఇయర్ థియరీ పరీక్షల షెడ్యూల్

ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2తో మొదలవుతాయి. ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్-2, మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2, మార్చి 8న మ్యాథమెటిక్స్ పేపర్-2బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. మార్చి 12న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, మార్చి 16న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-2, మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు.

మార్చి 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 పరీక్షలతో సెకండ్ ఇయర్ థియరీ పరీక్షలు పూర్తవుతాయి. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా ఇవే తేదీలు వర్తిస్తాయని, అయితే ఒకేషనల్ టైమ్ టేబుల్‌ను త్వరలో తెలియజేస్తామని విద్యామండలి పేర్కొంది.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు