Skip to content
Home » AP Politics : పవన్ కళ్యాణ్‌కు షాక్.. ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసిన జనసేన ఎమ్మెల్యే.. కారణం అదేనా?

AP Politics : పవన్ కళ్యాణ్‌కు షాక్.. ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసిన జనసేన ఎమ్మెల్యే.. కారణం అదేనా?

అమరావతి, సూర్య న్యూస్:ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రైల్వే కోడూరు (Railway Koduru) జనసేన ఎమ్మెల్యే (Janasena MLA) అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఆయన అందజేశారు. శనివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి అరవ శ్రీధర్ పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమపై వస్తున్న ఆరోపణల గురించి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధినేతకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇదే క్రమంలో శాసనసభలో విప్ (Whip) గా ఉన్న అరవ శ్రీధర్ తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే (Personal reasons) తాను విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.

గత కొద్ది రోజులుగా అరవ శ్రీధర్ (Arava Sridhar) పై పలు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే కోడూరుకు చెందిన ఒక వివాహిత మహిళ ఆయనపై సామాజిక మాధ్యమాల్లో (Social Media) సంచలన వీడియోలు విడుదల చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే కేసు నమోదు కావడంతో పాటు విచారణ కూడా జరుగుతోంది.

ఈ ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ (Janasena Party) అధిష్టానం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ముందు అరవ శ్రీధర్ తన వాదనను వినిపించారు. అయితే బాధిత మహిళ మరిన్ని వీడియోలు విడుదల చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ వివాదాలు మరియు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వ విప్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.