
హైదరాబాద్, సూర్య న్యూస్: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) పరిధిలో పనిచేస్తున్న బెలూన్ ఫెసిలిటీ (Balloon Facility) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్ (Scientific Assistant), డ్రైవర్ (Driver) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్ (బి), డ్రైవర్ (బి) కేటగిరీ పోస్టులు ఉన్నాయి.
అర్హతల వివరాలు:
సైంటిఫిక్ అసిస్టెంట్ (బి) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ (Electronics), ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (ECE), ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ (Diploma in Engineering) లేదా బీఎస్సీ (B.Sc) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం (Computer Knowledge) తప్పనిసరిగా ఉండాలి. డ్రైవర్ (బి) పోస్టుల విషయానికి వస్తే, అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ (SSC) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (Heavy Vehicle Driving License) కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను రాత పరీక్ష (Written Test), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview), ఫిజికల్ టెస్ట్ (Physical Test) మరియు ట్రేడ్ టెస్ట్ (Trade Test) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ (Online Appication) ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 9 చివరి తేదీగా ప్రకటించారు. మరిన్ని పూర్తి వివరాలు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కొరకు అధికారిక వెబ్‌సైట్ www.tifr.res.in ను సందర్శించవచ్చు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



