|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

TSLPRB Constable Recruitment 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్, జీతం రూ. 72 వేలకు పైనే!

Hyderabad, Surya News: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగార్థులకు (Police Job Aspirants) ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో (Police Transport Organisation) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

​ఈ ప్రకటన ద్వారా స్టేపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్), పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో (Online Applications) దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు.

SCT పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) – పురుషులు: 07 పోస్టులు

SCT పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) – పురుషులు: 20 పోస్టులు

కానిస్టేబుల్ (మెకానిక్): పదవ తరగతి (SSC) ఉత్తీర్ణతతో పాటు ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, లేదా ఫిట్టర్ ట్రేడుల్లో ITI సర్టిఫికేట్ ఉండాలి.​

కానిస్టేబుల్ (డ్రైవర్): ఇంటర్మీడియట్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ITI పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు చెల్లుబాటు అయ్యే హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

​వయస్సు: జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. హోంగార్డులకు ప్రత్యేక వయో పరిమితి నిబంధనలు వర్తిస్తాయి.​

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో జరుగుతుంది.

ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)​

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)​

ట్రేడ్ టెస్ట్ / డ్రైవింగ్ టెస్ట్ (Trade Test / Driving Test)​

టెక్నికల్ రాత పరీక్ష (Technical Written Exam – 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు)​

సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్షలు

దరఖాస్తు ప్రారంభ తేది: ఆగస్టు 19, 2026

​చివరి తేది: సెప్టెంబర్ 9, 2026​

కావాల్సిన పత్రాలు: 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్/నివాస ధృవీకరణ పత్రాలు, SC/ST/BC కుల ధృవీకరణ పత్రాలు (BC అభ్యర్థులు ఏప్రిల్ 1, 2026 తర్వాత పొందిన నాన్-క్రీమీలేయర్, EWS అభ్యర్థులు ఏప్రిల్ 1, 2026 తర్వాత పొందిన EWS సర్టిఫికేట్ సమర్పించాలి).

అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా TSLPRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp