|  
FLASH NEWS
సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  •  AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల  •  అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు  •  Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ  • 
Skip to content

కార్యకర్త కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండ.. రూ.40 వేల ఆర్థిక సాయం

1000972077
Chandur

చండూరు: పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఓ నిరుపేద కార్యకర్త అకాల మరణం చెందగా.. ఆ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ నాయకులు అండగా నిలిచారు. ఆర్థిక సాయం అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తిలో సోమవారం ఈ కార్యక్రమం చోటుచేసుకుంది.

బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు, 7వ వార్డు సభ్యుడు రేవెల్లి నరేశ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. సొంత కుటుంబ పరిస్థితులను సైతం పక్కనపెట్టి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన ఆయన మృతితో.. ఆ ఇల్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి రూ.40,000 నగదును ఆర్థిక సాయంగా అందజేశారు.

సాయం అందించిన నాయకులు వీరే..

  • బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్ రావు: రూ. 20,000
  • చండూరు మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న: రూ. 10,000
  • మండల యువజన విభాగం అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు: రూ. 10,000

కష్టకాలంలో పెద్ద మనసుతో తమకు అండగా నిలిచిన గులాబీ పార్టీ నాయకులకు నరేశ్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య, మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అనపర్తి శేఖర్, నాయకులు వరకాల శ్రవణ్, ఎండీ సత్తార్, వర్కాల నరసింహ, వర్కాల అంబేడ్కర్, చేదురవెల్లి లింగస్వామి, వరికుప్పల మహేష్, కాశీమల్ల అనిల్, మృతుని కుటుంబ సభ్యులు రేవల్లి చంద్రయ్య, రేవల్లి శ్రీను, రేవెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp