Skip to content

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కు బండ్ల గణేష్ భారీ సాయం.. నా దేవుడి స్ఫూర్తితో అంటూ సంచలన ట్వీట్

వరంగల్, సూర్య న్యూస్ : ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) తన మంచి మనసును చాటుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే బండ్ల గణేష్ కు ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పవన్ కళ్యాణ్ ను దేవుడిగా ఆరాధిస్తారు. అవకాశం దొరికినప్పుడల్లా పవన్ పై తన వీరభక్తిని చాటుకుంటూ ఉంటారు. తన కెరీర్ లో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ను అందించి నిర్మాతగా తనను నిలబెట్టిన పవన్ అంటే అందుకే బండ్ల గణేష్ కు అంత అభిమానం.

తాజాగా పవన్ కళ్యాణ్ వరంగల్ (Warangal) లో పర్యటించిన విషయం తెలిసిందే. తన వీరాభిమాని నిరంజన్ కోరిక మేరకు ఆయన హనుమకొండలోని హనుమాన్ నగర్ కు వెళ్లారు. అక్కడ ఉన్న నిరంజన్ ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ఆ బాలుడిని పరామర్శించారు. చాలా కాలంగా అరుదైన వ్యాధితో కాళ్లు పనిచేయక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిని చూసి పవన్ చలించిపోయారు. ఆ బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి అతని ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయంగా నిరంజన్ (Niranjan) కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

​ఈ విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. నా దేవుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అంటూ ఎక్స్ (X) వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరంజన్ కు తన వంతు సాయంగా రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. తన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ (Parameswara Art Productions) బ్యానర్ తరపున నిరంజన్ ట్రీట్మెంట్ కోసం ఈ సాయం చేస్తున్నట్లు ఆయన వివరించారు. తన దేవుడు పవన్ కళ్యాణ్ ఒక చిన్నారి అభిమాని చిరకాల కోరికను నెరవేర్చడం తనను ఎంతో కదిలించిందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ బండ్ల గణేష్ చేసిన ఈ సాయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp