|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

Thalapathy Vijay Divorce : సీఎం విజయ్‌కు ఊరట.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత

చెన్నై, సూర్య న్యూస్ : తమిళనాడు రాజకీయాలు మరియు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి (CM), టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్ (Thalapathy Vijay) విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన భార్య సంగీత (Sangeetha) కోర్టులో వేసిన విడాకుల (Divorce) పిటిషన్ ను అనూహ్యంగా వెనక్కి తీసుకున్నారు. దీనితో చెంగల్పట్టు జిల్లా కోర్టు ఈ విడాకుల కేసు విచారణను అధికారికంగా ముగించింది.

అసలు ఏం జరిగింది అంటే. విజయ్ నుంచి విడాకులు కావాలని కోరుతూ 2026 ఫిబ్రవరిలో ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె చేసిన ఆరోపణలు కోలీవుడ్ (Kollywood) తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.

తనను మానసికంగా మరియు శారీరకంగా వేధింపులకు గురిచేశారని సంగీత పిటిషన్ లో పేర్కొన్నారు. కనీస ఆర్థిక స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని ఆమె కోర్టుకు తెలిపారు. తన కదలికలపై ఆంక్షలు విధించారని మరియు మాటలతో తీవ్రంగా కించపరిచారని ఆమె వాపోయారు. ఇక విజయ్ తో కలిసి జీవించలేనని చెబుతూ తనకు విడాకులు ఇప్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

సంగీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు విజయ్ కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ తరుణంలో సంగీత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ను ఆమె ఉపసంహరించుకున్నారు. చెంగల్పట్టు కోర్టు విజయ్ విడాకుల కేసు విచారణను ముగించడంతో తమిళనాడు (Tamil Nadu) లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం ముగిసింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp