|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

Toxic Movie Collections : ‘టాక్సిక్’ వసూళ్లను దాటేసిన 2 కోట్ల సినిమా.. ఇదెక్కడి మాస్ రా మావా!

హైదరాబాద్, సూర్య న్యూస్ : కేవలం రూ.2 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘టాక్సిక్’ (Toxic Movie) వసూళ్లను సైతం క్రాస్ చేసి ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) సినిమా మరో సంచలనం నమోదు చేసింది.

రూ.366 కోట్లతో వసూళ్ల సునామీ

ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ అంశ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.366 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ క్రమంలో టాక్సిక్ సినిమా సాధించిన రూ.342 కోట్ల కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది. విడుదలైన 47వ రోజున కూడా ఈ చిత్రం ఏకంగా రూ.4.90 కోట్లు వసూలు చేయడం విశేషం. కేవలం రెండు కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

1001107303
1001107303

మేకర్స్ భయపడ్డారు.. కానీ

ఈ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లలో టాక్సిక్ మూవీ హవా తీవ్రంగా ఉంది. ఆ భారీ సినిమా పోటీని తట్టుకుని తమ చిత్రం నిలబడుతుందా లేదా అని హనుమాన్ అంశ్ మేకర్స్ ముందుగా భయపడ్డారు. కానీ కంటెంట్ బలంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఏకంగా టాక్సిక్ సినిమా వసూళ్లనే దాటేసి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం గమనార్హం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp