|  
FLASH NEWS
Box Office Trend : బాక్సాఫీస్ వద్ద భక్తి పారవశ్యం.. రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఇరుముడి, హనుమాన్ అంశ్  •  Indian Army : రూ.46 లక్షల అమెజాన్ ప్యాకేజీ వదిలేసి సైన్యంలోకి.. నువ్వు గ్రేట్ గురూ!  •  వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  • 
Skip to content

Box Office Trend : బాక్సాఫీస్ వద్ద భక్తి పారవశ్యం.. రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఇరుముడి, హనుమాన్ అంశ్

irumudi hanuman ansh box office
irumudi hanuman ansh box office

హైదరాబాద్, సూర్య న్యూస్ : భారతీయ బాక్సాఫీస్ (Indian Box Office) వద్ద భక్తి, పౌరాణిక నేపథ్యంతో వస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. స్టార్ ఇమేజ్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మిక అంశాలు కలగలిసిన చిత్రాలను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో రవితేజ నటించిన ఇరుముడి (Irumudi), బాలీవుడ్‌లో మైక్రో బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ చిత్రాలు వసూళ్ల సునామీ సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

200 కోట్ల క్లబ్‌లో ఇరుముడి

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి ఆగస్టు 21న విడుదలై ఘన విజయం సాధించింది. రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్‌తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల అనుబంధానికి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని అద్భుతంగా జోడించారు. కేవలం 15 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగమించింది. దీనితో రవితేజ కెరీర్‌లోనే తొలి 200 కోట్ల సోలో గ్రాసర్‌గా ఇది చరిత్ర సృష్టించింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మూడో వారంలోనూ భారీ ఆక్యుపెన్సీతో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా జన్మాష్టమి సెలవుల్లో ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి.

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హనుమాన్ అంశ్

హిందీలో విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ అంశ్ చిత్రం సంచలనంగా మారింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం, బోధనల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందింది. ఆగస్టు 7న ఎటువంటి భారీ ప్రచారం లేకుండా ఈ సినిమా విడుదలైంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి తొలి రోజు రూ.10 లక్షల వసూళ్లతో ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్‌తో పుంజుకుని 29 రోజుల్లో ఏకంగా రూ.82.88 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఐదో శుక్రవారం అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా ఇది సరికొత్త రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 11న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ద్వారా ఈ చిత్రం విదేశాల్లో భారీగా విడుదల కానుంది.

లాంగ్ రన్‌పైనే కన్ను

గత కొన్నేళ్లుగా హనుమాన్, కార్తికేయ-2 తదితర చిత్రాలు ఆధ్యాత్మిక నేపథ్యంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇరుముడి, హనుమాన్ అంశ్ విజయాలతో ఈ ట్రెండ్ మరింత బలపడింది. కేవలం భారీ ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా భక్తి, కుటుంబ సెంటిమెంట్ ఉన్న చిత్రాలు మూడో వారం తర్వాత కూడా థియేటర్లలో నిలబడుతున్నాయి. రామాయణం, వారణాసి వంటి భారీ ప్రాజెక్టులు సైతం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తి సినిమాల పట్ల ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆదరణ సినీ పరిశ్రమకు సరికొత్త మార్గదర్శకంగా మారుతోంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp