|  
● FLASH NEWS
Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  •  Supreme: ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెండ్ అయినట్లే: సుప్రీంకోర్టు  •  Cinematographer: షూటింగ్‌లో అస్వస్థత.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం  • 
Skip to content

Divorce: అన్నా లెజినోవా ఆస్తి ఎంతో తెలుసా? పవన్ విడాకుల వేళ వైరల్ అవుతున్న వివరాలు

రష్యాలో జన్మించి, సింగపూర్‌లో హోటల్ రంగంలో.. అన్నా లెజినోవా నేపథ్యం ఇదే

సూర్య న్యూస్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లోని ఒక అగ్ర రాజకీయ నాయకుడు తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఆమె నేపథ్యం, ఆస్తుల వివరాలపై విస్తృత చర్చ జరుగుతోంది.

అమరావతి, సూర్య న్యూస్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన మూడో భార్య అన్నా లెజినోవాతో (Anna Lezhneva) విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆమె నేపథ్యం, ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. రష్యాకు చెందిన అన్నా లెజినోవాకు సంబంధించి జాతీయ మీడియాలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 1980లో రష్యాలో జన్మించిన అన్నా లెజినోవాకు సింగపూర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. రష్యా, సింగపూర్‌లలో ఆమెకు కొన్ని హోటల్స్‌తో పాటు మొత్తం రూ.1,800 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె విద్యాభ్యాసం విషయానికొస్తే, 2024లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఆగ్నేయాసియా అధ్యయనాల్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌తో 2011లో ‘తీన్ మార్’ సినిమా సందర్భంగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2013 సెప్టెంబర్‌లో వీరు వివాహం చేసుకున్నారు. దాదాపు పుష్కర కాలం పాటు కలిసి ఉన్న వీరు, తాజా పరిణామాలతో తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నట్లు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp