|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

Taj Hotels : చెదిరిపోతున్న 47 ఏళ్ల జ్ఞాపకం.. కాలగర్భంలో కలిసిపోతున్న హైదరాబాద్ స్టార్ హోటల్!

Hyderabad, Surya News: హైదరాబాద్‌కు (Hyderabad) ఐకానిక్‌గా నిలిచిన 47 ఏళ్ల చరిత్ర ఉన్న తాజ్ బంజారా హోటల్ (Taj Banjara Hotel) నేలమట్టమైంది. బంజారాహిల్స్ లోని (Banjara Hills) ఈ భవన కూల్చివేత పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగర ఆతిథ్య రంగంలో ఈ హోటల్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

బంజారా లేక్ (Banjara Lake) పక్కన 3.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటల్ ఉండేది. కూల్చివేతలు పూర్తయిన తర్వాత ఈ స్థలంలో సుమారు 40 అంతస్తుల భారీ నివాస సముదాయాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును గేటెడ్ కమ్యూనిటీలా (Gated Community) భారీ టవర్లతో నిర్మించనున్నారు.

తాజ్ బంజారా హోటల్ స్థలాన్ని ప్రముఖ రియాల్టీ సంస్థ అరబిందో రియాల్టీ (Aurobindo Realty) రూ.315 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ హోటల్ ను 1979లో నిర్మించారు. ఇది నగరంలో తొలి విలాసవంతమైన హోటళ్లలో ఒకటిగా పేరుగాంచింది. ఎంతోమంది సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ బస చేశారు.

​ఈ హోటల్ ను 1986 వరకు ఐటీసీ గ్రూప్ (ITC Group) నిర్వహించింది. ఆ తర్వాత 40 ఏళ్ల పాటు తాజ్ జీవీకే హోటల్స్ (Taj GVK Hotels) వారు నడిపారు. 2023లో లీజ్ గడువు ముగియడంతో హోటల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ భవనానికి ఆస్తి పన్నుల (Property Tax) బకాయిలు కూడా రూ.కోటి 40 లక్షల వరకు ఉన్నాయి.

ఈ క్రమంలో అరబిందో సంస్థ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఏప్రిల్ నెలాఖరులో కూల్చివేత పనులు ప్రారంభించింది. ముందుగా హోటల్ లోని తలుపులు, కిటికీలు తొలగించారు. ప్రస్తుతం ప్రధాన భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఒకప్పటి ఐకానిక్ కట్టడం నేలమట్టం కావడంతో నగరవాసులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp