|   
🔴 BREAKING NEWS ► Trainee IPS Case : సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు.. ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారంటూ ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు! UPI Transaction Charges : యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై భారం పడుతుందా? నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇదే! Thalapathy Vijay Divorce : సీఎం విజయ్‌కు ఊరట.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత IRCTC Sapta Jyotirlinga Yatra : ఒక్క ట్రిప్‌లోనే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సిటిసి ప్రత్యేక భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే AP Weather Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
Skip to content

Trainee IPS Case : సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు.. ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారంటూ ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు!

హైదరాబాద్, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) ఏకంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) పైనే కోర్టుకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. విచారణ పేరుతో తనను తీవ్రంగా బెదిరించారని, ఏకంగా ఎన్‌కౌంటర్ చేస్తానని భయపెట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొనడం పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇటీవల అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు చంపేస్తానని బెదిరించినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఉదయ్ ను అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో గురువారం కస్టడీకి తీసుకున్నారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

శుక్రవారం కూడా ఆయనను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే రెండు రోజుల పాటు జరిగిన ఈ విచారణలో పోలీసుల ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. సదరు మహిళా అధికారితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ, తాను లైంగిక వేధింపులకు పాల్పడ్డానన్నది మాత్రం నిజం కాదని ఆయన పోలీసులకు తేల్చి చెప్పారు. ఒక దశలో “నన్నెందుకు వేధిస్తున్నారు.. నాతో ఏం చెప్పించాలనుకుంటున్నారు” అంటూ దర్యాప్తు అధికారులపై ఉదయ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం సాయంత్రం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో (Upparpally Court) హాజరుపరిచారు. ఆ సమయంలోనే ఆయన మెజిస్ట్రేట్ కు ఈ సంచలన లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. విచారణ సమయంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ తనను తీవ్రంగా బెదిరించారని, ఒక దశలో ఎన్‌కౌంటర్ చేస్తానని భయపెట్టారని ఆయన ఆరోపించారు. సీసీ కెమెరాలు (CCTV) లేని చోట తనను విచారించారని, టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తీసుకెళ్లి హింసించారని అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన మెజిస్ట్రేట్.. సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఎలా జరుపుతారు? అంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రెండు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ అత్తాపూర్ సీఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp