|  
● FLASH NEWS
INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  •  Dubai : హీరో స్మిత్‌కు ఆత్మీయంగా ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్.. ప్రశంసించిన ఐఏఎఫ్ చీఫ్  •  BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  • 
Skip to content

Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ గౌడ సంక్షేసంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పరుచూరి సురేష్ గౌడ్‌ను (Paruchuri Suresh Goud) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాయకత్వం ఘనంగా సత్కరించింది. కుత్బుల్లాపూర్‌లో (Quthbullapur) శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో ఆయనను శాలువాలు, పూలమాలలతో సత్కరించి గౌరవించారు.

​ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. సంఘం జాతీయ అధ్యక్షులు గట్టు రామచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు గుండాల మల్లేష్ గౌడ్ ఆదేశాలకు అనుగుణంగా తాము భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. బహుజన వర్గాలన్నీ ఒకే తాటిపైకి రావాలనే వారి పిలుపు మేరకు, బీసీ వర్గాలను ఏకం చేసే దిశగా జాతీయ అధ్యక్షులు ‘బీసీడీఎఫ్’ (BCDF)ను కూడా స్థాపించినట్లు సురేష్ గౌడ్ వెల్లడించారు.

ఈ సమావేశంలో బహుజన వర్గాల ఐక్యతపై నేతలు కీలక తీర్మానాలు చేశారు. తమ సంఘం సేవలను కేవలం గీత కార్మికుల ఇన్సూరెన్స్ సమస్యలు లేదా గౌడ సామాజిక వర్గానికే పరిమితం చేయకుండా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర బహుజన వర్గాల యువతను సైతం ఏకం చేయాలని నిర్ణయించారు. అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ.. వారంతా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేలా సహాయసహకారాలు విస్తృతం చేసే దిశగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఇదే కార్యక్రమంలో నిజాంపేట్ డివిజన్‌కు చెందిన యువ నాయకుడు ఉప్పల సాయి గౌడ్‌ను కూడా నాయకులు ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా సన్మానించారు. అణగారిన వర్గాలన్నీ ఒకతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని నేతలు స్పష్టం చేశారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ జ్యోతి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు యాకే గౌడ్, నర్సింహా గౌడ్ (గౌడ్ సాబ్), వెంకటేష్ గౌడ్, కృష్ణవేణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp