|  
● FLASH NEWS
Nvidia: గూఢచారితో సంబంధాలు.. సీఈవో పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్  •  Jobs: కృష్ణా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్  •  Teenmar: బీసీ రాజ్యాధికార పాదయాత్రలో అనుమానాస్పద రోడ్డు ప్రమాదం.. డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు  •  Panchayat: ఏపీలో స్థానిక పోరు షురూ.. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల నజరానా  •  BRS: నిర్మల్ రైతు గర్జన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ దళం ఫైర్  • 
Skip to content

ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ సతీమణికి ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి : గట్టు రామచంద్రరావు గౌడ్

ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ సతీమణికి ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని గట్టు రామచంద్రరావు గౌడ్ డిమాండ్ చేస్తూ విడుదలైన పోస్టర్

బచ్చన్నపేట, సూర్య న్యూస్ : తెలంగాణ కోసం కొట్లాడి, ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడిన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు గౌడ్ శుక్రవారం పరామర్శించారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమేనని, కనీసం ఇల్లు కట్టుకునే పరిస్థితిలో కూడా ఆ కుటుంబం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గట్టు రామచంద్రరావు గౌడ్ లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం, నేపథ్యంలో లక్ష్మణ్ గౌడ్ ఫోటో

ఉద్యోగం, ఉచిత విద్యతోనే ఆ కుటుంబానికి భరోసా

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం నూతనంగా ఏర్పాటైన డాక్టర్ కె.కేశవరావు, ప్రొఫెసర్ కోదండరామ్ కమిటీలు ఈ విషయంలో చొరవ తీసుకుని లక్ష్మణ్ గౌడ్ సతీమణికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చూడాలని రామచంద్రరావు గౌడ్ డిమాండ్ చేశారు. బి-ఫార్మసీ చదివిన ఆమెకు శాశ్వత జీవనోపాధి కల్పిస్తేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 2వ, 6వ తరగతులు చదువుతున్న ఇద్దరు పసిపిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా పూర్తి విద్యనందించాలని, వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలను సైతం ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గట్టు రామచంద్రరావు గౌడ్ లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి సాయం అందిస్తున్న దృశ్యం

గౌడ సంఘం నేతల పరామర్శ

ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పరుచూరి సురేష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏరుకొండ హేమావతి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు అంతాటి భాగ్యలక్ష్మి గౌడ్, నిజాంపేట అధ్యక్షుడు ఉప్పల సాయికుమార్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే, గ్రామ మాజీ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్, గీత పారిశ్రామిక సహకార సంఘం కొన్నె అధ్యక్షుడు అంబాల రాజేష్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎలకటి చంద్రం గౌడ్, సహకార సంఘం సభ్యులు కందుకూరి కనకరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

యూట్యూబ్ వీడియో: https://youtu.be/lqCrOecZFu4

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp