
మచిలీపట్నం, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఉన్న కృష్ణా యూనివర్సిటీ (Krishna University) అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టుల భర్తీకి లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీసీ బ్యాక్లాగ్ (క్యారీఫార్వర్డ్) ఖాళీల కింద మొత్తం మూడు పోస్టులను భర్తీ చేయనున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు
కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగంలో ఒకటి (బీసీ-బి), ఇంగ్లీష్ విభాగంలో ఒకటి (బీసీ-బి), మేనేజ్మెంట్ (ఎంబీఏ) విభాగంలో ఒకటి (బీసీ-ఎ) చొప్పున మొత్తం మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులతో పాటు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs) కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
రిజర్వేషన్లు మరియు ఇతర వివరాలు
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళలకు 33 1/3 శాతం, క్రీడాకారులకు 3 శాతం, మాజీ సైనికోద్యోగులకు 2 శాతం, దివ్యాంగులకు 4 శాతం చొప్పున సమాంతర (హారిజాంటల్) రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



