|  
● FLASH NEWS
Nvidia: గూఢచారితో సంబంధాలు.. సీఈవో పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్  •  Jobs: కృష్ణా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్  •  Teenmar: బీసీ రాజ్యాధికార పాదయాత్రలో అనుమానాస్పద రోడ్డు ప్రమాదం.. డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు  •  Panchayat: ఏపీలో స్థానిక పోరు షురూ.. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల నజరానా  •  BRS: నిర్మల్ రైతు గర్జన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ దళం ఫైర్  • 
Skip to content

Nvidia: గూఢచారితో సంబంధాలు.. సీఈవో పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్

సూర్య న్యూస్ డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) కు భారీ కుదుపు ఎదురైంది. కంపెనీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి (CEO) జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళతో ఆయనకు సన్నహిత సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెన్సన్ రాజీనామాతో ఎన్విడియా తాత్కాలిక సీఈవోగా కొలెట్ క్రెస్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

చైనా గూఢచారి, మరో మహిళతో సంబంధాలు

చైనా గూఢచారిగా భావిస్తున్న అలైస్ హువాంగ్‌ అనే మహిళతో జెన్సన్ హువాంగ్‌కు రొమాంటిక్ రిలేషన్ ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. సింగపూర్‌కు చెందిన ‘మెగాస్పీడ్’ కంపెనీలో పనిచేస్తున్న అలైస్‌.. జెన్సన్‌తో పరిచయం పెంచుకుని కీలక సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అలైస్ ఎక్కడ ఉన్నారనే సమాచారం ఇంకా బయటకు రాలేదు.

ఈ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్న తరుణంలోనే, జెన్సన్‌కు మరో మహిళతోనూ వివాహేతర సంబంధం ఉందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. ఎన్విడియా హెల్త్ కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో ఆయన రిలేషన్ కొనసాగించినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ రిపోర్టులపై ఎన్విడియా బోర్డు అధికారికంగా స్పందించనప్పటికీ, జెన్సన్ హువాంగ్‌పై చర్యలకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్యనే ఆయన సీఈవో పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Tags:
📲 Join WhatsApp