|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

Lenskart Controversy : హిందూ సంప్రదాయాలపై లెన్స్‌కార్ట్ ఉక్కుపాదం.. సీఈవో పీయూష్ బన్సల్ అబద్ధాలు బట్టబయలు!

​ముంబై, సూర్య న్యూస్: దేశీయ ఐవేర్ దిగ్గజం లెన్స్‌కార్ట్ (Lenskart) చుట్టూ వివాదం ముదురుతోంది. సంస్థాుపకుడు మరియు సీఈవో (CEO Peyush Bansal) వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ మత విశ్వాసాలను, సంప్రదాయాలను కించపరిచేలా సంస్థ నిబంధనలు రూపొందించడమే కాకుండా, ఈ విషయంలో సీఈవో పదే పదే అబద్ధాలు ఆడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ, పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా భారీగా నిధులు సమకూర్చుకున్న ఈ 5.6 బిలియన్ డాలర్ల కంపెనీ, ఉద్యోగుల డ్రెస్ కోడ్ విషయంలో అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలు ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి.

వివాదాస్పద ‘స్టైల్ గైడ్’.. హిజాబ్‌కు ఓకే, బొట్టుకు నో!

లెన్స్‌కార్ట్ తన స్టోర్ సిబ్బంది కోసం ఏప్రిల్ 15న ఒక ‘స్టైల్ గైడ్’ (Style Guide) విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న నియమాలు హిందూ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి.

సిబ్బంది ఎవరూ నుదుట బిందీ (Bindi) లేదా తిలకం ధరించకూడదు.

చేతికి కంకణాలు, రక్షా దారాలు కట్టకూడదు.

వివాహిత మహిళలు సింధూరం చాలా తక్కువగా వాడాలి, అది కూడా బయటకు కనిపించకూడదు.

విచిత్రమేమిటంటే, ఇదే పాలసీలో హిజాబ్ (Hijab) ధరించడానికి మాత్రం స్పష్టమైన అనుమతిని ఇచ్చారు.

సీఈవో పీయూష్ బన్సల్ బుకాయింపులు

​ఈ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఈవో పీయూష్ బన్సల్ (Peyush Bansal) మొదట అది అబద్ధమని కొట్టిపారేశారు. అయితే ఎక్స్ (X) ప్లాట్‌ఫారమ్‌లో కమ్యూనిటీ నోట్స్ ద్వారా ఆ డాక్యుమెంట్ ఫిబ్రవరి 2026 నాటిదని, కంపెనీ బ్రాండింగ్‌తోనే ఉందని తేలడంతో ఆయన మాట మార్చారు. అది ఒక పాత ట్రైనింగ్ డాక్యుమెంట్ అని, అందులో తప్పు దొర్లిందని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

జీతాల్లో కోతలు.. సాక్ష్యాలతో దొరికిపోయిన యాజమాన్యం

సీఈవో మాటలన్నీ అబద్ధాలని పుణెకు చెందిన లెన్స్‌కార్ట్ స్టోర్ మేనేజర్ ఆకాష్ ఫలకే (Akash Phalke) బయటపెట్టిన ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఈ వివక్షాపూరిత పాలసీపై ఆయన నవంబర్ 2025 నుంచే హెచ్ఆర్ (HR) విభాగానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 20న ఆయన ప్రభుత్వ గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా, అదే రోజు లెన్స్‌కార్ట్ యాజమాన్యం ఆయనను ఉద్యోగం నుండి తొలగించడం గమనార్హం. కేవలం బొట్టు పెట్టుకున్నారనే కారణంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్టోర్ ఆడిట్ రిపోర్టుల ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో కోతలు కూడా విధించినట్లు ఈమెయిల్ సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు జైపూర్ కు చెందిన జోసెఫ్ సోఫియా అనే ఉద్యోగిని కూడా కేవలం మతపరమైన ఆచారాల కారణంగా వేధింపులకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. హిందూ సంప్రదాయాలను కించపరుస్తూ, అబద్ధాలతో కవర్ చేస్తున్న లెన్స్‌కార్ట్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp