|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

AP Police Jobs 2026 : ఏపీ పోలీస్ శాఖలో 1,154 పోస్టుల భర్తీ.. ఇంటర్ అర్హతతో దరఖాస్తులు?

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ (AP Police) శాఖలో 2026 సంవత్సరానికి గాను భారీగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో (Social Media) విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు యూట్యూబ్ (YouTube) మరియు ఇతర ఇంటర్నెట్ వేదికలలో ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ వైరల్ పోస్టర్ ప్రకారం ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్హత కలిగిన మగ మరియు ఆడ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం లేదా బోర్డు నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.

పోస్టర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం పోలీస్ శాఖ, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ శాఖ, మరియు ఫైర్ సర్వీసెస్ (Fire Services) విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. సివిల్, ఏఆర్ (AR), ఏపీఎస్పీ, ఫైర్ మెన్, మరియు జైల్ వార్డెన్ లాంటి పోస్టుల భర్తీ ఈ రాబోయే నోటిఫికేషన్ ద్వారా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

పోస్ట్ కోడ్ 21: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సివిల్ కానిస్టేబుల్ (SCT Police Constables Civil Men/Women) విభాగంలో 540 ఖాళీలు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.

పోస్ట్ కోడ్ 22: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ (SCT Police Constables AR) విభాగంలో 205 ఖాళీలు ఉన్నాయని రాశారు.

పోస్ట్ కోడ్ 23: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ (SCT Police Constables APSP Men) విభాగంలో 80 ఖాళీలు ఉన్నాయి.

పోస్ట్ కోడ్ 24: జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో పురుష వార్డెన్ల (Wardens Men) కోసం 150 ఖాళీలు ఉన్నాయి.

​పోస్ట్ కోడ్ 25: జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో మహిళా వార్డెన్ల (Wardens Women) కోసం 21 ఖాళీలు ఉన్నాయి.

​పోస్ట్ కోడ్ 26: ఏపీ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్‌మెన్ (Firemen) విభాగంలో 158 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

మొత్తం ఖాళీలు: ఈ వైరల్ పోస్టర్ ప్రకారం అన్ని విభాగాలు కలిపి మొత్తం 1,154 ఖాళీలు ఉన్నాయి.

ఈ ముఖ్యాంశాలు గమనిస్తే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. మగ మరియు ఆడ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ (Civil), ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్‌మెన్, జైల్ వార్డెన్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

గమనిక: అభ్యర్థులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏపీ (SLPRB AP) బోర్డు నుండి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. పూర్తి వివరాలు, దరఖాస్తు తేదీలు, వయసు పరిమితి మరియు ఎంపిక విధానం తదితర వివరాలు అధికారిక వెబ్‌సైట్ (Official Website) slprb.ap.gov.in లో విడుదల అయిన తర్వాతే ఖచ్చితంగా తెలుస్తాయి. అభ్యర్థులు కేవలం అధికారిక నోటిఫికేషన్ కోసం మాత్రమే వేచి ఉండాలని సూచిస్తున్నాము.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp