
సూర్య న్యూస్ డెస్క్: ఆఫ్రికా దేశం కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా (Ebola Virus) వ్యాప్తి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాంగోలో ఇప్పటివరకు 10,141 మందికి వైరస్ సోకగా, వారిలో దాదాపు సగం మంది అంటే 4,928 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ త్వరలోనే గ్లోబల్ స్థాయికి వ్యాపించే ప్రమాదం ఉందని, అన్ని దేశాలు దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా బ్రిటన్ సురక్షితంగా లేదని, మొత్తం యూరప్ దేశాలు రెడ్ అలర్ట్‌లో ఉన్నాయని ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఎవరూ సురక్షితం కాదని అన్ని దేశాలు గ్రహించాలని వారు హెచ్చరిస్తున్నారు. కొన్ని నెలలుగా కాంగోను వణికిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మే నెలలో ప్రారంభమైన వ్యాప్తి, ఆగస్టు నాటికి ఆ దేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరంగా మారిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
కాంగో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 8 ప్రావిన్సులలో 10,300కు పైగా కేసులు నమోదు కాగా, 5వేల మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఈ వ్యాధి కేసు ఫెటాలిటీ రేటు (మరణాల రేటు) 48.6 శాతంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆందోళనకరంగా కాంగో పొరుగు దేశాలైన కెన్యా, నైజీరియా, ఉగాండాలోనూ కొత్తగా కేసులు వెలుగుచూస్తుండటం గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ భయాలను పెంచుతోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



