|  
● FLASH NEWS
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  •  10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్!  •  Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  •  Groundwater: తెలంగాణలో డేంజర్ బెల్స్.. 324 మండలాల్లో కరువు పరిస్థితులు  • 
Skip to content

TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) త్వరలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటవీ శాఖలోని (Forest Department) 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి నవంబర్ నెలలో నోటిఫికేషన్ రానుందని అధికారిక వర్గాల సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఈ పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇంటర్మీడియట్ (Inter) విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయసు పరిమితి విషయానికొస్తే 18 నుంచి 31 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులని తెలుస్తోంది. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 36 ఏళ్ల వరకు, దివ్యాంగ (PwD) అభ్యర్థులకు 41 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని సమాచారం.

ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ. 35,000 నుంచి రూ. 42,000 వరకు వేతనం (Salary) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, త్వరలోనే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. అటవీ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్న యువత ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp