|  
● FLASH NEWS
Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  •  Groundwater: తెలంగాణలో డేంజర్ బెల్స్.. 324 మండలాల్లో కరువు పరిస్థితులు  •  ట్రంప్ నన్ను దారుణంగా రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు  •  PNB: జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం  • 
Skip to content

Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్, సూర్య న్యూస్ : తన కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంపై ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) వేదికగా ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.

కేబీసీ షోలో అమితాబ్ అడిగిన ఓ ప్రశ్నకు సాయి పల్లవి బదులిస్తూ.. తన భర్తకు ముందుగా మంచి మనసు ఉండాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఏవైనా తప్పులు చేసినా, వాటిని గ్రహించి వెంటనే సరిదిద్దుకునే గుణం అతనికి ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా అతనికి స్వార్థం ఉండకూడదని, తాను చేసిన తప్పులకు ఇతరులను నిందించే స్వభావం అసలే ఉండకూడదని ఆమె కుండబద్దలు కొట్టారు.

తన భాగస్వామి వ్యక్తిత్వం గురించి ఇన్ని విషయాలు చెప్పిన సాయి పల్లవి.. చివరగా ఓ ఆసక్తికరమైన కోరికను కూడా బయటపెట్టారు. తన భర్తకు వంట చేయడం వస్తే ఎంతో బాగుంటుందని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp