|  
FLASH NEWS
China Ocean Minerals : పసిఫిక్ సముద్ర గర్భంలో అపారమైన బంగారం, వెండి నిక్షేపాలు.. చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు  •  Artificial Paneer Ban : తెలంగాణలో పనీర్ ప్రియులకు షాక్.. కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం  •  Joe Root Records : సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. టెస్టుల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్!  •  HYDRA Toll Free Number : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. అత్యవసర సేవల కోసం హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!  •  AP Liquor Policy : మద్యం ప్రియులు, వ్యాపారులకు బిగ్ అలర్ట్.. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్మితే రూ.10 లక్షల ఫైన్!  • 
Skip to content

Dhee 10 Raju Arrested : ‘ఢీ’ టైటిల్ విన్నర్ రాజు అరెస్ట్.. లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ కు తరలింపు

హైదరాబాద్, సూర్య న్యూస్ : పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ (Dhee 10) టైటిల్ విన్నర్, కొరియోగ్రాఫర్ రాజును లైంగిక వేధింపుల (Sexual Harassment) కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్‌కు తరలించారు.

బాధిత యువతి ఫిర్యాదుతో ప్రాథమిక ఆధారాలు సేకరించిన మియాపూర్ పోలీసులు, ఈ నెల తొమ్మిదో తేదీన రాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన అనంతరం అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం రిమాండ్ కస్టడీలో ఉన్న రాజును పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఒక సెలబ్రిటీపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయాన్ని పోలీసులు ఇన్ని రోజుల పాటు అత్యంత గోప్యంగా ఉంచడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా బుల్లితెర లేదా వెండితెర తారలపై ఇలాంటి ఆరోపణలు వస్తే ఆ వార్త క్షణాల్లో బయటకు వస్తుంది. కానీ, రాజు వ్యవహారాన్ని పోలీసులు సీక్రెట్‌గా ఉంచడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల జోక్యంతో అతనికి బెయిల్ ఇప్పించేందుకే ఇలా చేశారా అన్న కోణంలో సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఇటీవల డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఎవరైనా కుట్ర పన్ని రాజును ఈ కేసులో ఇరికించారా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో..

గత సీజన్‌లో కూడా టైటిల్ విన్నర్‌గా నిలిచిన రాజు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల ఒక సినిమాలో హీరోగా నటించే అవకాశం కూడా దక్కించుకున్నాడు. అలాగే ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ఈటీవీలో ప్రారంభం కానున్న ‘ఢీ 21’ షోలో కూడా పాల్గొనాల్సి ఉంది. ఇలా కెరీర్ అత్యున్నత దశలో ఉన్న సమయంలో ఊహించని విధంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు పాలు కావడం అతని అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వ్యవహారంలో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp