|  
FLASH NEWS
Tollywood Director Arrest : పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్… చంచల్‌గూడ జైలుకు తరలింపు  •  TOXIC Movie Review : ‘కేజీఎఫ్’ స్థాయి మ్యాజిక్ రిపీట్ అయిందా? యశ్ ‘టాక్సిక్’ సినిమా అసలు కథ మరియు పబ్లిక్ టాక్ ఇదే  •  Suryapet Road Accident : సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. నిద్రమత్తులో ఉండగానే ఆరుగురు బలి!  •  సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  • 
Skip to content

Tollywood Director Arrest : పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్… చంచల్‌గూడ జైలుకు తరలింపు

tollywood-director-arrest-marriage-deception-suryanews.jpg
tollywood-director-arrest

హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ (Tollywood) పరిశ్రమలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ యువ దర్శకుడు పవన్ సాధినేనిని (Pavan Sadineni) గోల్కొండ పోలీసులు (Golconda Police) అరెస్ట్ చేశారు. ఒక నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సినిమాల్లో అవకాశాలు ఇస్తానని ఆశ చూపి ఆ దర్శకుడు తనతో సహజీవనం చేశాడని నటి ఆరోపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీనితో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడని కూడా ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ సాధినేనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని గోల్కొండ ఇన్‌స్పెక్టర్ పి. సైదులు ధృవీకరించారు. ప్రస్తుతానికి ఇవి ఆరోపణలు మాత్రమే అని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

పవన్ సాధినేని వయసు 40 ఏళ్లు. ఆయన హైదరాబాద్ లోని నార్సింగిలో నివసిస్తున్నారు. 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత నారా రోహిత్ తో సావిత్రి సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన సేనాపతి సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పిల్లా, ఈ ఆఫీసులో, కమిట్‌మెంటల్, దయా వంటి వెబ్ సిరీస్ లకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. దయా సిరీస్ కు గాను ఆయన ఉత్తమ దర్శకుడిగా అవార్డు కూడా అందుకున్నారు.

​ప్రస్తుతం పవన్ సాధినేని ఒక భారీ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సాత్విక వీరవల్లి, శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మరియు స్వప్న సినిమా సమర్పిస్తుండగా లైట్ బాక్స్ మీడియా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన నటి పేరును పోలీసులు గోప్యంగా ఉంచారు. విచారణ పూర్తయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp