|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ

ఒడిశా తీరంలో పెను విషాదం.. 8 నిమిషాల్లోనే జలసమాధి అయిన ‘ఎంవీ ఓషన్ విన్నర్’ (MV Ocean Winner)

bay-of-bengal-cargo-ship-sinks.jpg
bay-of-bengal-cargo-ship-sinks

​సూర్య న్యూస్ డెస్క్: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 230-240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంవీ ఓషన్ విన్నర్’ (MV Ocean Winner – IMO 9145530) అనే భారీ కార్గో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలోని 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భారత కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సంయుక్తంగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

ప్రమాదం ఎలా జరిగింది?

అధికారిక సమాచారం ప్రకారం.. ఆగస్టు 20, 2026 (గురువారం) రాత్రి 10:42 గంటల సమయంలో ఎంవీ ఓషన్ విన్నర్ నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్టు నుంచి బయలుదేరింది. ఈ నౌకలో ఏకంగా 72,100 మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) ఉంది. ఇది సింగపూర్ లేదా చైనా వెళ్లాల్సి ఉండగా, ఆగస్టు 22 (శనివారం) ఉదయం 11:48 గంటలకు నౌక ట్రాకింగ్ సిస్టమ్ నుంచి అకస్మాత్తుగా కనుమరుగైంది. వెంటనే శ్రీ విజయపురం (పోర్ట్ బ్లెయిర్)లోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌ (MRCC)కు సమాచారం అందింది.

​8 నిమిషాల్లోనే జలసమాధి..

అసలు ఏమైంది?నౌక ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే రక్షించబడిన సిబ్బంది చెబుతున్న వివరాల ప్రకారం.. శుక్రవారం నుంచే నౌక ఒక వైపునకు వాలడం (Listing) ప్రారంభమైంది. పరిస్థితి విషమించి కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే ఆ భారీ నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

ఇద్దరు సేఫ్.. 22 మంది కోసం ముమ్మర గాలింపు

ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ‘MT Aisopos’ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. సముద్రంలో లైఫ్‌రాఫ్ట్‌ల సహాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు చైనా సిబ్బందిని ఆగస్టు 22 రాత్రి 8 గంటల సమయంలో రక్షించింది.

నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 20 మంది చైనా జాతీయులు కాగా, ముగ్గురు మయన్మార్, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన ‘ఐసీజీఎస్ వరద్’, ‘అన్మోల్’, ‘విజిత్’ నౌకలతో పాటు.. ఇండియన్ నేవీకి చెందిన ‘P-8I’ నిఘా విమానం ద్వారా బంగాళాఖాతంలో విస్తృత గాలింపు కొనసాగుతోంది.

​ఎంవీ ఓషన్ విన్నర్ (MV Ocean Winner) నౌక ముఖ్యాంశాలు:

నిర్మించిన సంవత్సరం: 1998

​సామర్థ్యం: 72,928 డెడ్‌వెయిట్ టన్నులు

​కొలతలు: 225 మీటర్ల పొడవు, 32.26 మీటర్ల వెడల్పు

​గత పేర్లు: గతంలో ఈ నౌకను Tiara Globe, Sun Winner II పేర్లతో పిలిచేవారు.

ఈ ప్రమాదంపై కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, రక్షిత ఇద్దరు సిబ్బందికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp