
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జాబ్ క్యాలెండర్ (Job Calendar 2026) ను విడుదల చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా ఇప్పటికే తొలి దశ కింద ఉన్నత విద్యాశాఖకు చెందిన 1,523 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇక రెండో దశ కింద సెప్టెంబర్ 15న 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో గ్రూప్-1 కేటగిరీలో 149 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖలో 542 కానిస్టేబుల్ పోస్టులు, 182 సివిల్ ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు అటవీ, పశుసంవర్ధక శాఖలకు చెందిన ఖాళీలు కూడా ఈ దశలో భర్తీ కానున్నాయి.
ఆ తర్వాత అక్టోబర్ 15న మూడో దశలో భాగంగా 2,311 పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. ఇందులో గ్రూప్-2 లో 673 పోస్టులు, డిప్యూటీ తహసీల్దార్ కు సంబంధించి 200 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్, విద్యుత్, ఎక్సైజ్ తదితర విభాగాల్లో మరో 1,638 పోస్టులను భర్తీ చేస్తారు. ఇక అదే రోజున నాలుగో దశ కింద 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలోనే 2,991 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీని ద్వారా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీగా అవకాశాలు లభించనున్నాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



