|   
🔴 BREAKING NEWS ► అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF
Skip to content

Telangana ACB : వరలక్ష్మి వ్రతం రోజే ‘ధనలక్ష్మి’కి ఆశపడి దొరికిపోయిన వరలక్ష్మి… ఏసీబీ వలలో అవినీతి చేప!

varalakshmi-vratam-dhanalakshmi-arrest.jpg
varalakshmi-vratam-dhanalakshmi-arrest.

మంచిర్యాల, సూర్య న్యూస్: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (Telangana ACB) అధికారులు అవినీతిపరుల ఆట కట్టిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Officials) రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజే వరలక్ష్మి అనే అధికారిణి ‘ధనలక్ష్మి’కి ఆశపడి ఇలా అడ్డంగా దొరికిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని లింగయ్యపల్లె గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న వరలక్ష్మి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. స్థానికంగా ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఆమెను కోరారు. ఆ అనుమతి ఇవ్వడానికి కార్యదర్శి వరలక్ష్మి 11 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.

బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అధికారులు శుక్రవారం జన్నారంలో మాటు వేశారు. కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp